ENG v WI 2024: ఏడేళ్ల తర్వాత సెంచరీ.. ఇంగ్లాండ్ గడ్డపై విండీస్ బ్యాటర్ తడాఖా

ENG v WI 2024: ఏడేళ్ల తర్వాత సెంచరీ.. ఇంగ్లాండ్ గడ్డపై విండీస్ బ్యాటర్ తడాఖా

ఇంగ్లాండ్ గడ్డపై ప్రత్యర్థి బ్యాటర్ ఆడాలంటే సవాలుతో కూడుకున్నది. స్వింగ్, బౌన్స్ కు ఎక్కువగా అనుకూలించే ఈ పిచ్ లపై స్టార్ బ్యాటర్ సైతం పరుగులు చేయడానికి తంటాలు పడతాడు. అయితే వెస్టిండీస్ బ్యాటర్ కవెమ్ హాడ్జ్ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు. సెంచరీతో ఇంగ్లీష్  బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 171 బంతుల్లో 120 పరుగులు చేసి 7 ఏళ్ళ తర్వాత టెస్టుల్లో ఇంగ్లాండ్ పై సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

హాడ్జ్ ఇన్నింగ్స్ లో 19 ఫోర్లున్నాయి. చివరిసారిగా ఇంగ్లాండ్ లో షై హోప్ 2017లో సెంచరీ చేశాడు. పటిష్టమైన ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్నీ అడ్డుకొని తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విండీస్ బ్యాటర్ సెంచరీ చేయగానే స్టేడియంలో ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి చప్పట్లతో అభినందించారు.  అతనితో పాటు అతనాజ్ (82) హాఫ్ సెంచరీ చేయడంతో రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు వెస్టిండీస్ గట్టి పోటీనిస్తుంది. అతనాజ్ (82) హాడ్జ్ (120) నాలుగో వికెట్ కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. 

ALSO READ | T20 Blast: 15 బంతుల్లో 5 వికెట్లు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్పిన్ మ్యాజిక్

ఈ ఇద్దరి భాగస్వామ్యంతో వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. హోల్డర్(23), డిసిల్వా(32) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 65 పరుగులు వెనక పడి ఉంది. చేతిలో 5 వికెట్లు ఉండడంతో మూడో రోజు మ్యాచ్ కీలకం కానుంది. అంతకముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో పోప్ (121) సెంచరీ చేయడంతో 416 పరుగులకు ఆలౌటైంది.