హైదరాబాద్, వెలుగు : విత్తనాలు, సాగు ఉత్పత్తుల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్లో రూ.282 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.267.84 కోట్లతో పోలిస్తే ఇది 5.63 శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.767.30 కోట్ల నుంచి రూ.808.08 కోట్లకు పెరిగింది.
ఇబిటా రూ.279.09 కోట్ల నుంచి రూ.292.79 కోట్లకు ఎగిసింది. పుస్తకాల్లో నగదు నిల్వలు రూ.741 కోట్ల నుంచి రూ.605 కోట్లకు తగ్గాయి. ఎగుమతులు వార్షికంగా 451 శాతం పెరిగాయి. హైబ్రిడ్రైస్, మక్కలు, పత్తి ఉత్పత్తి పెరిగిందని కావేరీ సీడ్స్ తెలిపింది.