తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.

తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.

తిరుపతిలో అయ్యప్ప భక్తులు రోడ్డున పడ్డారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో డ్రైవర్ దుశ్చర్య వల్ల రోడ్డున పడ్డారు. గురువారం ( డిసెంబర్ 12, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్ లో  శబరిమలకు వెళ్లిన 35 మంది అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం ఆలస్యం కావడంతో భక్తుల లగేజి కిందపడేసి వెళ్ళిపోయాడు డ్రైవర్.

దర్శనానికి వెళ్లొచ్చేసరికి తమ లగేజి రోడ్డు మీద పడి ఉండటం, బస్సు లేకపోవటం చూసి అవాక్కయిన అయ్యప్ప భక్తులు డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు అయ్యప్ప భక్తులు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు టోల్ గేట్ దగ్గర బస్సును ఆపించారు.

ALSO READ : శ్రీశైలంలో శివదీక్ష విరమణ ప్రారంభం.. పాతాళగంగ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు..

ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి పోలీసులు.