ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్టయి జైలులో ఉన్నారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. కానీ ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. తీహార్ జైలులో ఉన్న కవితతో మరోసారి భేటీ అయ్యారు కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కవితకు వచ్చేవారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కవిత జైల్లో చాఆ ఇబ్బందులు పడుతుందన్న కేటీఆర్.... ఇప్పటికి 11 కిలోల బరువు తగ్గిందన్నారు.
లిక్కర్ కేసులో అరెస్టైన అయిన బీపీతో బాధపడుతుందని... రోజుకు రెండు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 11 వేలమంది ఖైదీల సామర్ధ్యం ఉన్న జైలులో 30 వేలమంది ఖైదీలున్నారు. జైలు పరిశుభ్రంగా లేదు. జైలు కు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్ లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది
దేశంలో రాజకీయకోణంలో కోట్లాడేవారికి ఇలాంటివి తప్పవు అంటూ... బెయిల్ కోసం మరోసారి అప్పీలు చేశామన్నారు. ఇదే కేసులో అరెస్టైన సిసోడియా బెయిల్ అంశంపై స్పందిస్తూ.. చాలా ఆలోచించి మాట్లాడాలంటూ... ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు కూడా వస్తుందని భావిస్తన్నామన్నారు.