
గడిచిన 5 సంవత్సరాలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు ఎంపీ కవిత. జగిత్యాలలో కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పెడచెవిన పెట్టిందని అన్నారు. దీంతో పాటే.. పసుపు బోర్డ్ విషయం లో చాలా సార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని అన్నారు.
బీజేపీ అంటే భారతీయ జూట్ పార్టీ అని విమర్శించారు కవిత. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అందుకే.. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కి ఓటు వేయమని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి రెండు జాతీయపార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. దేశం కోసం దర్మం కోసం పాటుపడేది టీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. రాష్ట్ర యువత కేసీఆర్ చేసే అభివృద్ధిని చూసి కారు గుర్తుకే ఓటేయాలని కవిత కోరారు
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…
రాష్ట్రాన్ని మోడల్ తెలంగాణగా అభివృద్ధి చేయడం లో కేసీఆర్ కృషి అభినందనీయమని అన్నారు కొప్పుల ఈశ్వర్. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని రంగల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు చావుదెబ్బ తిన్నాయని.. దీంతో కుట్రపూరితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కవితపై 170 నామినేషన్ లు వేయించారని ఆరోపించారు.