రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ సెటైర్లు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే రాహుగాంధీ ఎన్నిలు ఎక్కడుంటే అక్కడికే వెళ్తారని.. అందుకే ఆయన ఎన్నికల గాంధీ అని పేరు పెట్టుకోవాలని సూచించారు. నిజామాబాద్ లో మాట్లాడిన కవిత .. ఎన్నిక వేళ ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు పోతుంటారని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంకాపూర్ కు వచ్చి చికెన్ రుచి చూడాలి కానీ.. ఇక్కడకు వచ్చి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని సూచించారు.
Also read :- బండి సంజయ్కు కరీంనగర్లో పోటీ చేసే దమ్ము లేదు
కాంగ్రెస్ అన్నీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు కవిత. బీఆర్ఎస్ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని విమర్శించారు. తెలంగాణ తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.