నిజామాబాద్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ గడువు ముగింపు దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్.. తన కుమార్తె కవితకు సీటు కేటాయిస్తూ ప్రకటన చేశారు. దాంతో కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నారు. గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలుగా దూరంగా ఉంటున్నారు. అందుకే ఆమెకు ఈ సీటు కేటాయించి.. మళ్లీ ఆమెను లైవ్‌లోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ రోజు కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో ఆమె భేటీ కానున్నారు. కవిత మొదటగా మంత్రుల క్వార్టర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవనున్నారు. ఆ తర్వతా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్‌కు వెళ్లి ఈ రోజు మధ్యాహ్నం కవిత నామినేషన్ వేయనున్నారు.
For More News..