నిజామాబాద్ కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తం : కవిత

నిజామాబాద్ కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తం : కవిత

నిజామాబాద్ కు రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టును తీసుకొస్తున్నామని చెప్పారు కవిత.  జాక్రాన్ పల్లి రోడ్ షో లో మాట్లాడిన ఆవిడ.. ఇప్పటికే 800 ఎకరాల భూమిని పరిశీలించామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ జాక్రాన్ పల్లి కి సమాపంగానే రానుందని తెలిపారు. దీంతో పాటే..  నిజామాబాద్ లో ఐటి హబ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మళ్ళీ ఎంపీగా తనకు అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తానని చెప్పారు కవిత.

కేసీఆర్ ను రెండోసారి సీఎం చేసిన తెలంగాణ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని చెప్పారు కవిత. ఏ ఆధారం లేని ప్రజలకు వంద శాతం సబ్సిడీ కింద రూ.50 వేలు రుణం ఇచ్చామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడతామని అన్నారు. జిల్లాలో పాసు బుక్కులు రాని కొన్ని గ్రామాలున్నాయని… త్వరలోనే  పాస్ బుక్ లు అందరికీ అందజేస్తాయని చెప్పారు. పీఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులకు ప్రతీ ఒక్కరికి మే నుంచి రూ.2 వేల రూపాయల ఫించన్ వస్తదని తెలిపారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తామని చెప్పారు కవిత.