ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక నుంచి ప్రజాభవన్‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్​మండలం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి లీడర్లు, ఆయా గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

 అనంతరం వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడర్లు రమణారెడ్డి, శ్రీగిరి రంగారావు, లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, తహసీల్దార్​కనకయ్య, ఎంపీడీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు