అబ్బే.. ఆ బాల్ కూడా కొట్టలేవా.. ఛీ..! సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కావ్య పాప రియాక్షన్

అబ్బే.. ఆ బాల్ కూడా కొట్టలేవా.. ఛీ..! సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కావ్య పాప రియాక్షన్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. ఆ జట్టు ఓనర్ కావ్య మారన్‎కు కూడా అదే రేంజ్‎లో అభిమానులు ఉంటారు. కొందరైతే కావ్య మారన్ కోసమే మ్యాచ్ చూడటానికి వస్తారంటే అతిశయోక్తి కాదు. ఇంకొందరు అభిమానులు ముద్దుగా ఆమెను కావ్య పాప అని పిలుచుకుంటారు. ఐపీఎల్‎‎లో10 జట్లు ఉండగా.. ఇందులో ఒక్క కావ్య మారన్‎కు మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం. ఇందుకు ప్రధాన కారణం ఎస్ఆర్‎హెచ్ మ్యాచ్ సమయంలో కావ్య ఎక్స్‎ప్రెషన్స్, ఎమోషన్సే. 

సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోతే బాధ పడటం.. గెలిస్తే ఎగిరి గంతేయడం.. ఇలా ప్రతి మూవెంట్‎ను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే కావ్య మారన్ ఇచ్చిన మరో ఎక్స్‎ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 25) చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్‎హెచ్, సీఎస్కే తలపడ్డాయి. చెన్నై విధించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి సన్ రైజర్స్ విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‎లో గెలిచి పోటీలో నిలిచింది. 

Also Read:-అలా ఏడ్పించేశారేంటీ భయ్యా: CSK ఓటమి.. స్టాండ్స్ లోనే కన్నీళ్లుపెట్టుకున్న స్టార్ హీరోయిన్..

అయితే.. సన్ రైజర్స్ ఇన్సింగ్స్‎లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఎస్ఆర్‎హెచ్ ఇన్సింగ్స్‎లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ 16 ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో నూర్ ఒక నోబాల్ వేశాడు. దీంతో ఎస్ఆర్‎హెచ్‎కు ఫ్రీ హిట్ లభించింది. 15 పరుగులతో అప్పటికే క్రీజులో ఉన్న కమిందు మెండిస్ ఆఫ్ స్టంప్ వెలుపల నూర్ అహ్మద్ విసిరిన ఫ్రీ హిట్ బాల్‎ను భారీ షాట్ కొట్టబోగా మిస్ అయ్యింది. బంగారం లాంటి ఫ్రీ హిట్ బాల్‎ను మెండిస్ డాట్ చేయడంతో కావ్య మారన్ తీవ్ర అసహనానికి గురైంది. ‘అబ్బే.. ఆ బాల్ కూడా కొట్టలేవా’ అన్న రీతిలో కావ్య రియాక్షన్ ఇచ్చింది. దీంతో కావ్య మారన్ రియాక్షన్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.