IPL 2025: బీసీసీఐతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు మీటింగ్.. కావ్య మారన్ అభ్యర్ధనలు ఇవే

IPL 2025: బీసీసీఐతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు మీటింగ్.. కావ్య మారన్ అభ్యర్ధనలు ఇవే

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఆసక్తికరంగా మారింది. పాత నిబంధనలు పట్ల ఫ్రాంచైజీలు సంతృప్తిగా లేనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం (జూలై 31) సమావేశం నిర్వహించింది. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఈ సమావేశంలో అందరూ ఫ్రాంచైజీలు తమ అభ్యర్థనలను బీసీసీఐకు తెలిపారు. ఇందులో భాగంగా సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తన ఐపీఎల్ లో కొన్ని సూచనలను చేయాలను బీసీసీఐకు వివరించారు.   

“ఐపీఎల్ 2025 లో కొన్ని రూల్స్ మార్చాలి. కనీసం 7 గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేలా ఉండాలి. వేలంలో కొన్న తర్వాత ఆటగాళ్లు గాయం కారణంగా లేకపోతే వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటే వారిని ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేయాలి. ప్లేయర్‌తో చర్చించి రిటైన్డ్ లేదా ఆర్‌టీఎమ్‌తో వెళ్లాలా అనే నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉండాలి. అన్ క్యాప్డ్, విదేశీ ప్లేయర్ల సంఖ్యను పరిమితం చేయకూడదు. ఈ విషయంలో ఫ్రాంచైజీలకు స్వేచ్ఛ ఉండాలి". అని కావ్య మారన్ ఈ మీటింగ్ లో చెప్పుకొచ్చారు. 

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టురన్నరప్ గా నిలిచింది. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించిన ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఓడినా ఫ్రాంచైజీ ఓనర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసింది. నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాల్సి వస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, కెప్టెన్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ జట్టులో ఉండే అవకాశం ఉంది. మరి 2024 సీజన్ లో హిట్ అయిన సన్ రైజర్స్.. 2025 ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి కొత్త జట్టుతో బరిలోకి దిగుబోతుందో చూడాలి.