ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని కావ్య మారన్ క్రికెట్ పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్ రైజర్స్ ఓనర్ గా ప్రతి మ్యాచ్ లో ఉత్సాహంగా పాల్గొంటూ ఆటగాళ్లను ముందుండి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. గెలిచినప్పుడు ఎగిరి గంతులు వేయడం.. ఓడిపోతే అంతకముంచి నిరాశకు గురవవడం మనం ప్రతి మ్యాచ్ లో చూస్తూనే ఉంటాం. అయితే ఈమెకు క్రికెట్ కు క్రికెట్ తో పాటు కార్లంటే అమితమైన ఇష్టమా తెలుస్తుంది. ఈమె దగ్గర ఉన్న అత్యంత కార్ల లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం.
కావ్యమారన్ ఖరీదైన కార్ కలెక్షన్
-Rolls-Royce ఫాంటమ్ VIII EWB: ధర: రూ. 12.2 కోట్లు
-బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు
-BMW i7- ధర: రూ. 2.13 కోట్లు
-ఫెరారీ రోమా- ధర: రూ. 3.76 కోట్లు.
కావ్య మారన్ ఒక ప్రముఖ కుటుంబం నుండి వచ్చింది, ఆమె తండ్రి కళానిధి మారన్ మీడియా మొగల్, సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి క్రీడలు, కార్లపై బాగా ఆసక్తి చూపించేదట. నివేదికల ప్రకారం కావ్యమారన్ ఆస్తుల విలువ రూ. 409 కోట్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ CEOగా ఆమె హాజరయ్యే ప్రతి మ్యాచ్‌లో జట్టు పట్ల ఆమెకున్న అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read:పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పఠాన్
ప్రస్తుతం సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతుంది. గత రెండు సీజన్ లుగా చెత్త ప్రదర్శన చేసిన ఆ జట్టు ఈ సీజన్ లో దూసుకుపోతుంది. ఓటమితో సీజన్ ప్రారంభించినా.. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. మొత్తం 7 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. రేపు (ఏప్రిల్ 25) ఉప్పల్ వేదికగా సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కు సిద్ధమవుతుంది.