ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
  • రాత్రి వేళల్లో వాహనాలను అడ్డుకోవద్దని మంత్రి 
  • కొండా సురేఖ ఆదేశం

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల తర్వాత వాహనాల రాకపోకలకు విధించిన నిషేధం ఎత్తివేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు.  మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో అటవీ శాఖ మంత్రి  కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.

వాహనాల రాకపోకలపై ఫారెస్ట్ ఆఫీసర్లు విధించిన నిషేధం కారణంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మంత్రి సురేఖ స్పందిస్తూ చెక్ పోస్టుల వద్ద  రాత్రి వేళ వాహనాల రాకపోకలను అడ్డు కోవద్దని పీసీసీఎఫ్​ను ఆదేశించారు. దీంతో రాత్రి వేళలో వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ రావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.