జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ కవాసకీ ఇండియా మార్కెట్లో ‘నింజా 300’ పేరుతో ప్రీమియం బైక్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.3.34 లక్షలు. ఇందులోని 296 సీసీ ఇంజన్ 39 పీఎస్ పీక్ పవర్‌ను, 26.1 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. డూయల్ చానెల్ ఏబీఎస్, హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, డైమండ్ చాసిస్వంటి ప్రత్యేకతలు ఈ బైక్ సొంతం.
నానో డీఏపీ లాంచ్
ఎరువుల తయారీ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ నానో టెక్నా లజీతో డెవలప్ చేసిన ‘నానో డీఏపీ’ ని లాంచ్ చేసింది. సుమారు 700 పొలాల్లో ట్రయల్స్ నిర్వహించామని వెల్లడించింది. నానో డీఏపీని తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాదిలోనే ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.