robot horse:హైడ్రోజన్ పవర్డ్ ‘రోబో గుర్రం’ వచ్చేస్తుంది..గంటకు 80కి.మీల వేగం

robot horse:హైడ్రోజన్ పవర్డ్ ‘రోబో గుర్రం’ వచ్చేస్తుంది..గంటకు 80కి.మీల వేగం

జపనీస్ కంపెనీ కవాసకి కొత్త ఆవిష్కరణను రివీల్ చేసింది. హైడ్రోజన్ తో నడిచే రోబో హార్స్ను  తయారు చేసింది. గంటలకు 50మైళ్ల వేగం అంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ రోబో గుర్రం పరుగెత్తుతుంది. దీనికి కార్లియో అని పేరు పెట్టారు. దీనిపై ఇద్దరు వ్యక్తులు కన్ ఫర్ట్ గా కూర్చొని ప్రయాణించవచ్చు. దీనిని ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో సునాయసనంగా ప్రయాణించేందుకు వినిగియోగించవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాయంతో పనిచేస్తుంది. 

రోబో హార్స్ ప్రత్యేకంగా 150 సిసి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే జనరేటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది గుర్రానికి ఇంజిన్ గా పనిచేయడమే కాదు.. చల్లని వాటర్ కూడా ఇస్తుంది. పర్వతప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఇది బాగా పనికొస్తుంది. 

ఈ రోబో హార్స్ ను కవాసకి హెవీ ఇండస్ట్రీస్ తయారు చేస్తుంది. దీనిని ఏప్రిల్ 4న నిర్వహించిన ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పో ప్రివ్యూలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కార్లియో రోబో గుర్రం హైడ్రోజన్ ఇంధనం ఘటకాల శక్తితో పనిచేస్తుంది. 

అధిక సామర్థ్యం కోసం ఈ రోబోలోని వెనక కాళ్లలో ప్రత్యేకమైన జాయింట్లు ఉంటాయి. రోబోట్ యుద్ధాలు చేస్తే రైడర్లను వెనుక నుంచి రక్షణ, రైడర్లు లేచి నిలబడేందుకు,ఆయుధాలు తీసుకునేందుకు వెసులుబాటుగా ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. కవాసకి వేగవంతమైన పెద్ద పెద్ద లోయలు ఉండే భూభాగాల్లో రైడింగ్ కు అనుకూలమైన హార్స్ అంటోంది  కవాసకి హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ. 

వీడియోలో కార్లియో హాట్ 'ఎన్' హెవీ ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసినట్లు కనిపిస్తంది. పిల్లి లాగా ఒక పెద్ద బండరాయి నుంచి మరో పెద్ద బండరాయికి దూకుతున్నట్లు కనిపిస్తుంది. ఎత్తు పళ్లాలున్న ప్రదేశాల్లో బాగా పరుగెత్తగలదని వీడియో చూస్తే అర్థమవుతుంది. దీని AI మెదడు తన ముందున్న వస్తువులను, మనుషులను జాగ్రత్తగా గమనిస్తుంది. ఎలా తప్పించుకుని పరుగుపెట్టాలో నిర్ణయించుకుంటుంది. 

అదే సమయంలో రైడర్ నుంచి శరీర కదలికలకు అనుగుణంగా కంట్రోల్ చేసుకుటుంది. రాత్రి సమయంలో ఇది చిన్న యారో  మార్క్స్ ను ప్రదర్శించడం ద్వారా ముందుకు వెళ్లే మార్గాన్ని హైలైట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇది అన్ని రకాల కఠినమైన శబ్దాలు ,రియల్, హానికర జాతులతో అవసరం లేకుండా రోబోట్ హార్స్ ను రూపొందించారు.