Kayadu Lohar : రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌ చిత్రంతో .. టాలీవుడ్‌కి న్యూ క్రష్‌గా కయాదు లోహర్

Kayadu Lohar : రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌ చిత్రంతో ..  టాలీవుడ్‌కి న్యూ క్రష్‌గా కయాదు లోహర్

రోజుకో కొత్త హీరోయిన్‌‌ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. కానీ వారిలో యూత్‌‌ మనసులు కొల్లగొట్టి, క్రష్‌‌ అనిపించుకునే వాళ్లు మాత్రం అతికొద్దిమంది. ఆమధ్య రష్మిక..  ఆ తర్వాత ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీ నేషనల్‌‌ క్రష్ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో కయాదు లోహర్ టాలీవుడ్ సినీ కుర్రకారుకు క్రష్‌‌గా మారింది.  ఇటీవల విడుదలైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌’ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌‌కు జంటగా ఆమె నటించింది. తొలిచిత్రంతోనే తమిళనాట విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు కుర్రకారును కూడా ఫిదా చేసింది. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్తేమీ కాదు.

గతంలో శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ అనే చిత్రంలో నటించింది. కానీ అంతగా గుర్తింపును అందుకోలేదు. ఇప్పుడు ‘డ్రాగన్‌‌’ హిట్ అవడంతో పాటు తన నటన యూత్‌‌కు నచ్చడంతో తనకు ఫాలోయింగ్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌‌లో  ఆమె చేసే అల్లరికి, తన క్యూట్‌‌నెస్‌‌కు యూత్‌‌ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘ఇదయం మురళి’ అనే చిత్రంలో నటిస్తోంది. విశ్వక్ సేన్‌‌ హీరోగా అనుదీప్ తెరకెక్కిస్తున్న ‘ఫంకీ’ చిత్రం కోసం ఆమెను సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తెలుగులో బిజీ అవ్వాలని తాపత్రయపడుతున్న కయాదు లోహర్.. ఆ ప్రయత్నంలో ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి!