టైం అంటే ఇదే : నకిలీ పాస్ పోర్ట్.. 30 ఏళ్ల తర్వాత దొరికాడు

టైం అంటే ఇదే : నకిలీ పాస్ పోర్ట్.. 30 ఏళ్ల తర్వాత దొరికాడు

 సరిగ్గా 30 ఏళ్ల క్రితం మార్చి 7, 1994న ఫోర్జరీ సంతకాలతో పాస్ పోర్టు పొందిన వ్యక్తిని కేరళలోని కాయంకుళం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాయంకుళంలోని పరంబిల్ హౌస్క చెందిన షాహిల్ హమీద్ అనే వ్యక్తి 30 ఏళ్ల క్రితం పై అధికారుల సంతకం ఫోర్జరీ చేసి పాస్ పోర్టు పొందాడు. ఆ సమయంలో  ఫోర్జరీని గుర్తించిన కొచ్చి  పాస్ పోర్టు అధికారి హమీద్ పై కాయంకుళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు.


 కానీ అప్పటికే హమీద్ విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు కూడా కేసును మర్చిపోయారు. కాగా ఇటీవలే విదేశాల నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన హమీద్ తన సాధారణ జీవితం గడుపుతున్నాడు. తాజాగా జిల్లా ఎస్పీ  చైత్ర తెరాస జాన్ పెండింగ్ కేసుల పరిష్కారానికి లాంగ్ పెండిగ్ వారెంట్ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా 30 ఏళ్ల కిందటి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన పోలీసులు ఇంటికి వెళ్లగా హమీద్ వారికి చిక్కాడు. తన మీద కేసు ఉన్న విషయం తానే మర్చిపోయానని.. 30 ఏళ్ల తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం షాక్ కు గురిచేసిందని ఈ సందర్భంగా హమీద్ తెలిపాడు.

పోలీసు బృందంలో కాయంకుళం డివైఎస్పి బాబుకుట్టన్ , ఎస్ఐలు రతీష్ బాబు, అరుణ్ షా,  నీసామ్, సివిల్ పోలీసు అధికారులు సాజు, అఖిల్ ఎస్, ఆనంద్, షాన్, గోపకుమార్, అన్హాద్, అను, హరీస్ ఉన్నారు. హమీద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని వారు తెలిపారు.