
క్రికెట్ లో సౌతాఫ్రికా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. మెన్స్, ఉమెన్స్ తో పాటు అండర్ 19 లోనూ వారికి దురదృష్టం వెంటాడింది. ఫైనల్ కు చేరుకునే క్రమంలో అద్భుతంగా ఆడిన సఫారీ మహిళలు.. ఆదివారం (ఫిబ్రవరి 2) భారత్ పై తుది మెట్టుపై బోల్తా పడ్డారు. ఫైనల్లో కనీసం పోటీ ఇవ్వకుండా 9 వికెట్ల తేదాత్ భారత్ చేతిలో ఓడిపోయారు. అద్భుతమైన జట్టు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు.. స్టార్ ఆటగాళ్లతో కళకలాడుతుంది.. ఐసీసీ టోర్నీ అంటే ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.
32 ఏళ్లుగా వరల్డ్ కప్ ముందు వరకు సౌతాఫ్రికా ప్రస్తావన ఇది. అయితే దురదృష్టవశాత్తు ఆ జట్టుకు ఇప్పటివరకు ఐసీసీ టైటిల్ అందని కలగానే మిగిలిపోయింది. 2024లో సౌతాఫ్రికా మెన్స్ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా మహిళల క్రికెట్ టీం 2024 లోనే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఫైనల్ సమరంలో టైటిల్ చేజార్చుకుంది. మరోసారి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ చేజారడంతో సౌతాఫ్రికా కెప్టెన్ కైలా రెనేకే భావోద్వేగానికి గురైంది.
ALSO READ | Ranji Trophy: రంజీ ట్రోఫీలో పిచ్ ట్యాంపరింగ్ కలకలం.. మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన J&K
మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.. "అమ్మ, నాన్న నన్ను క్షమించండి. సౌతాఫ్రికాకు నా క్షమాపణలు. త్వరగా పుంజుకుంటాం". అని కెప్టెన్ కైలా రెనేకే ఎమోషనల్ అయింది. ఈ మ్యాచ్ లో కైలా రెనేకే బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. 21 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయింది. ఆదివారం (ఫిబ్రవరి 2) సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులు చేయగా.. 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది.
Emotional South Africa skipper Kayla Reyneke after losing the U19 World Cup final. 💔🇿🇦 pic.twitter.com/fDh3cJGyda
— CricketGully (@thecricketgully) February 2, 2025