సెమీకండక్టర్ల తయారీలో అగ్రగామి కేన్స్ టెక్నాలజీ సంస్థ కొంగరకలాన్ లో నిర్మించిన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ఈనెల 23న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాలుపంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ సంస్థ ఆహ్వానించింది. ఈ మేరకు కేన్స్ టెక్నాలజీ సంస్థ సీఈవో రఘు ఫణికర్ సోమవారం( August 19) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
తాము తెలంగాణతోనే కొనసాగుతామని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేన్స్ టెక్నాలజీ సీఈవో రఘు ఫణికర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అలాగే, ఇదే కేన్స్ టెక్నాలజీ కొత్తగా ఏర్పాటుచేయనున్న వోఎస్‌ఏటీ యూనిట్ అనుమతుల అంశం పరిశీలనలో ఉంది. ఇండియన్ సెమికండక్టర్ మిషన్ నుంచి అనుమతులు రాగానే ఓశాట్ యూనిట్ ఆపరేషన్స్ కూడా ప్రారంభిస్తామని కేన్స్ టెక్నాలజీ సీఈవో ఫణికర్ తెలిపారు.
సెమీకండక్టర్ల తయారీలో అగ్రగామి కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) సంస్థ కొంగరకలాన్ లో నిర్మించిన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ (Kaynes semicon pvt Ltd Kongara kalan)ను ఈనెల 23న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాలుపంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థ ఆహ్వానించింది.
ఈ మేరకు కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) సంస్థ సీఈవో రఘు ఫణికర్ (Raghu Panicker) సోమవారం(ఆగస్టు 19) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నుకలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.తాము తెలంగాణలోనే కొనసాగుతామని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) సీఈవో రఘు ఫణికర్ ముఖ్యమంత్రికి తెలిపారు.