తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన : రావు పద్మ

కాజీపేట, వెలుగు : ఏళ్లు గడుస్తున్నా కాజీపేట అభివృద్ధికి నోచుకోవడం లేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్‌‌ వెస్ట్‌‌ క్యాండిడేట్‌‌ రావు పద్మ అన్నారు. మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌‌రావు, గొర్ల అభివృద్ధి ఫెడరేషన్ మాజీ చైర్మన్‌‌ రాజయ్య యాదవ్‌‌తో కలిసి శుక్రవారం కాజీపేట, సోమిడితో పాటు కేయూ గ్రౌండ్‌‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగుతుంటే..

నియోజకవర్గంలో కబ్జాలు, కమీషన్ల రాజ్యం నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శించారు. ఆమె వెంట వెస్ట్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి మురళీధర్‌‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరబోయిన సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోశ్‌‌రెడ్డి, దేశిని సదానందంగౌడ్ ఉన్నారు.