- సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
- కాజీపేట లోకో షెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే లోకో షెడ్ ను మరింత డెవలప్మెంట్ చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. కాజీపేట లోకో షెడ్ ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలకు జీఎం చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఎక్స్టెన్షన్, ఎలక్ట్రిక్ లోకో కొత్త మిషనరీ పనులు ప్రారంభించారు. రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రైల్వేలో ఎలక్ర్టిక్ లోకోల ప్రాధాన్యం పెరగనుందని తెలిపారు.
దానికి తగినట్టుగా కాజీపేటలోని డీఎల్ఎస్ షెడ్‌ని తొందర్లోనే పూర్తి స్థాయి ఈఎల్ఎస్ షెడ్‌గా మార్చి, మరింత మంది సిబ్బందిని రిక్రూట్‌చేస్తామని వివరించారు. సౌత్ సెంట్రల్ రైల్వేతో పాటు దేశంలోనే కాజీపేట లోకో షెడ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించి పలు ఐఎస్వో సర్టిఫికెట్లను సాధించి మంచిపేరు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా, పీసీసీ ఈఈ పీడీ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.