కాజీపేట–మేడారం హెలికాప్టర్ సర్వీసులు షురూ

కాజీపేట, వెలుగు: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం గురువారం నుంచి హెలికాప్టర్​సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్​కు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హనుమకొండ జిల్లాలోని కాజీపేట నుంచి మేడారానికి హెలికాప్టర్​సర్వీసులను అందిస్తోంది. ఒక్కొక్కరికి రానూపోనూ కలిపి రూ.29వేలు చార్జ్​చేస్తోంది. కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లోపు వీఐపీ దర్శనం చేయించి, తిరిగి కాజీపేట చేరుస్తోంది.

అలాగే మేడారంలోని జాతర పరిసరాలను వీక్షించేందుకు జాయ్ రైడ్​కు ఒక్కొక్కరి నుంచి రూ.4,300 చార్జ్ చేస్తోంది. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాజీపేట నుంచి మేడారం జాతరకు నాలుగు హెలికాప్టర్​సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. కాజీపేట ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్​నుంచి హెలికాప్టర్​రైడ్​ మొదలవుతుంది.