చరిత్ర సృష్టించిన బుల్లితెర షోలలో కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan) హోస్ట్ గా 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో.. గత 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
అంతేకాదు..ఈ ప్రోగ్రాం వ్యూవర్స్ ను టీవీల ముందు కట్టిపడేస్తుందంటే ఆశ్చర్యం లేదు..15 ఎపిసోడ్ లు కంప్లీట్ చేసికున్న ఈ కౌన్ బనేగా కరోడ్ పతి షో..ప్రస్తుతం సీజన్ 16 ఇంట్రెస్టింగా సాగుతోంది. ఆడేవాళ్లకే కాదు.. చూసేవాళ్ల మెదడుకు కూడా పదును పెట్టే ఈ గేమ్ షోలో.. లేటెస్ట్ షోతో రికార్డు స్పృష్టించాడు ఓ కుర్రాడు. వివరాల్లోకి వెళితే..
జమ్మూ & కాశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ (Chander Prakash) కౌన్ బనేగా కరోడ్‌పతి 16 సీజన్లో కోటీ గెలుచుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. యుపిఎస్‌సి సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోన్న చందర్ ప్రకాష్ మొదటి కోటీశ్వరుడుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఆట ఆడే చందర్ (సెప్టెంబర్ 25) బుధవారం నాడు రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. కోటి ప్రశ్నకు ప్రయత్నించి గెలిచి నిలిచాడు.
రూ.కోటి ప్రశ్న::
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్ చందర్ ప్రకాశ్ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. మరి ఆ ప్రశ్న ఏంటీ? ఎలా ఆట ఆడాడో చూద్దాం.
‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’? అని హోస్ట్ అమితాబ్ ప్రశ్న అడిగారు.
దీనికి అప్షన్లుగా.. ఎ) సోమాలియా బి) ఒమన్ సి) టాంజానియా డి) బ్రూనై
ప్రశ్న విన్న చందర్ ప్రకాష్ సమాధానం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇందులో చందర్ ప్రకాశ్ ‘డబుల్ డిప్’ లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకుని ఆప్షన్ సి. టాంజానియాను ఎంచుకున్నాడు.
Also Read:-దేవర దర్శనం ముందే..
అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ అమితాబ్ ప్రకటించాడు. వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో, చిరునవ్వుల ఆనందాలతో, కొంతమంది కళ్ళల్లో ఆనంద భాష్పాలతో అతడిని అభినందించారు. ఏకంగా.. సూపర్ స్టార్ అమితాబ్ హాట్ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ షోలో రూ.కోటితో పాటు అతడు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.
రూ.7కోట్లు వచ్చేవే కానీ..
ఆ తర్వాత చందర్ ప్రకాశ్ రూ.7కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు.
‘‘1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’’ అని అమితాబ్ ప్రశ్నించాడు.
ప్రశ్న విన్న ప్రకాశ్..సమాధానం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరగా ఆశలు వదులుకున్నారు. అతను గేమ్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయిం చుకున్నాడు. రూ.1కోటితో మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే, జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే ఉన్న లైఫ్‌లైన్లు అన్ని వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్ అయ్యాడు.
ఆ తర్వాత అమితాబ్ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడిగారు. అతడు ఆప్షన్ ఎ) వర్జనీయా డేర్ అని ప్రకాశ్ చెప్పగా.. అదే సరైన జవాబు అని బిగ్‌బీ తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. సమాధానం తెలిసి కూడా రూ.7కోట్లు మిస్ చేసుకున్నాడు.. ఇంత టాలెంట్ ఎక్కడ చూడలే అని ప్రశంసలు అందించారు.
ఇక చందర్ యొక్క అపారమైన జ్ఞానంతో ముగ్ధుడైన అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. “జ్ఞాన్ ఔర్ ధన్, యే ఏక్ హై దోర్ కే వో సైరే హే జిన్మే సారా జీవన్ జో హై వో గుల్ మిల్ జాతా హై". మనం ఎంత జ్ఞానాన్ని పొందగలమో దానికి పరిమితి లేనట్లే, దాని నుండి వచ్చే సంపదకు కూడా పరిమితి లేదు.
జ్ఞానం అనేది.. వయస్సు, మతం లేదా కులం ద్వారా పరిమితం చేయబడదు. జ్ఞానం ద్వారా సంపాదించిన సంపద ప్రతి ఒక్కరికీ విలువైనది. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే, దానితో పాటు మన సంపద అంతగా పెరుగుతుంది. ఈ రోజు మనతో ఉన్న చందర్ ప్రకాశ్ దీనికి గొప్ప ఉదాహరణ అని కొనియాడారు బిగ్ బి.
చందర్ ప్రకాశ్ 22 ఏళ్ల చందర్ ప్రకాశ్ చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రేగు సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న చందర్ ఐఏఎస్ సాధించాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.