అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షో.. కైన్ బనేగా కరోడ్ పతి..ఈ ప్రోగ్రాం వ్యూవర్స్ ను టీవీల ముందు కట్టిపడేస్తుందంటే ఆశ్చర్యం లేదు.. 15 ఎపిసోడ్ లు కంప్లీట్ చేసికున్న ఈ కౌన్ బనేగా కరోడ్ పతి షో.. తాజాగా 16వ ఎపిసోడ్ గురువారం (సెప్టెంబర్ 5) నిర్వహించారు. తాజా ఎపిసోడ్ లో గిరిజన వర్గానికి చెందిన బంతి వడివా.. కోటి రూపాయల ప్రశ్నను ప్రయత్నించారు. అయితే దానికి సమాధానం చెప్పలేకపోవడంతో రూ. 50 లక్షలు మాత్రమే గెలుచుకున్నాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటీ.. ? ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు..?
బంతి వడివా రూ.50లక్షలు గెలుచుకున్నాడు..
కౌన్ బనేగా కరోడ్ పతి 16 (KBC16) షోలో పాల్గొన్న బంతి వడివా.. కోటి ప్రశ్న వరకు చేరుకున్నారు.. అయితే కోటి రూపాయల ప్రశ్న చాలా క్లిష్టంగా అడిగారు అమితాబ్ బచ్చన్.. బెంగాలీ శిల్పి చింతామోని కర్ గురించి క్లిష్టమైన ప్రశ్న అడిగారు అమితాబ్ బచ్చన్. ఆ ప్రశ్న ఏంటంటే..
ప్రశ్న:1948లో బెంగాలీ శిల్పి చింతామోని కర్ ది స్టాగ్ అనే ఆర్ట్‌వర్క్ టైటిల్‌ని గెలుచుకున్నారు?
ఆప్షన్లుగా ఎ) పైథాగరస్ ప్రైజ్, బి) నోబెల్ ప్రైజ్, సి) ఒలింపిక్ మెడల్ డి) ఆస్కార్ అవార్డు.
ప్రశ్న విన్న బంతి వాడివా సమాధానం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరగా ఆశలు వదులుకున్నారు. అతను గేమ్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయిం చుకున్నాడు. రూ.50 లక్షలు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన నిర్ణయం తర్వాత అమితాబ్ బచ్చన్ రూ.1 కోటి ప్రశ్నకు సరైన సమాధానాన్ని
వెల్లడించాడు. ఇది ఆప్షన్ సి) ఒలింపిక్ పతకం. బంతి వడివాకు వీడ్కోలు పలికిన బిగ్ బి పోటీదారుడి కృషి , అంకితభావాన్ని ప్రశంసించారు. ఆయన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.