బోనస్​ ఇష్యూకు కేబీసీ గ్లోబల్ గ్రీన్​సిగ్నల్

బోనస్​ ఇష్యూకు కేబీసీ గ్లోబల్ గ్రీన్​సిగ్నల్

హైదరాబాద్​, వెలుగు: నాసిక్​ కేంద్రంగా పనిచేసే కేబీసీ గ్లోబల్ డైరెక్టర్ల బోర్డ్​​ బోనస్ ఇష్యూ ప్రతిపాదనకు గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చింది. ప్రతి షేర్ ​హోల్డర్​కు ఒక్కో షేరు చొప్పున ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ పేరుతో ధరణ్​ ఇన్​ఫ్రా–ఈపీసీ లిమిటెడ్​గా మార్చడానికి అంగీకారం కుదిరింది. 

అప్పులను భారీగా తగ్గించుకుని వ్యాపారాన్ని విస్తరిస్తామని కేబీసీ ప్రకటించింది. ఆథరైజ్డ్​ క్యాపిటల్ ​పెంపు, కంపెనీ పేరు మార్పుకు బోర్డు అంగీకరించిందని ప్రకటించింది. ఆర్డర్​ బుక్ ​విలువ రూ.200 కోట్లు ఉందని తెలిపింది. తాజాగా పతంజలి ఫుడ్స్, ఫాల్కన్ ​పీక్​ ఫండ్ ​కేబీసీలో రూ.99.50 కోట్లు ఇన్వెస్ట్​ చేశాయి.