దళితులకు డప్పులు అందజేత : చైర్మన్ బాల్ రెడ్డి 

దళితులకు డప్పులు అందజేత : చైర్మన్ బాల్ రెడ్డి 
  • కేబీఆర్ ఫౌండేషన్  వ్యవస్థాపక చైర్మన్ బాల్ రెడ్డి 

ములుగు, వెలుగు: దళితులు ఆర్థికంగా ఎదగాలని కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కొన్యాల బాల్ రెడ్డి అన్నారు. ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన దళితులకు 60 డప్పులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కొన్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ముత్యాలు, గణేశ్, వెంకటేష్, భిక్షపతి పాల్గొన్నారు.