
- ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు
ములుగు, వెలుగు: ఓ దినపత్రిక ఎడిటర్ కుమారుడి వివాహం ఆదివారం సిద్దిపేటలో జరగగా కేసీఆర్, శోభ దంపతులు ఇవాళ మర్కుక్ పాములపర్తి గ్రామంలోని హయాన ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన బర్త్ డే పురస్కరించుకుని కేసీఆర్ దంపతులు దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ పెండ్లి చేసుకుంటున్నా అంటూ కేసిఆర్ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలంలోని ఎర్రవల్లిలోని సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆయనను కలసి బర్త్ డే విషెస్ చెప్పారు. ఎర్రవెల్లిలో యాగం నిర్వహించారు.