కేసీఆర్​ పుట్టిన రోజున 71 కిలోల కేక్ కటింగ్ : తలసాని

కేసీఆర్​ పుట్టిన రోజున 71 కిలోల కేక్ కటింగ్ : తలసాని
  • ఘనంగా నిర్వహిస్తాం: తలసాని 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల కేకును కట్​ చేస్తామని చెప్పారు. కేసీఆర్​ బర్త్​ డే వేడుకలపై ఆదివారం తెలంగాణ భవన్​లో తలసాని సమీక్ష నిర్వహించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టినరోజు వేడుకలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు కేటీఆర్, హరీశ్​,  కవితతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నేతలు హాజరవుతారని వెల్లడించారు