ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బైఎలక్షన్ ఖాయం: కేసీఆర్

ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బైఎలక్షన్ ఖాయం: కేసీఆర్
  • ప్రజలు వారికి బుద్ధి చెబుతారు
  • ఫామ్​హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన తాటికొండ రాజయ్య

హైదరాబాద్, వెలుగు:పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్​పూర్‌లో కడియం శ్రీహరి ఆగడాలు పెరుగుతున్నాయన్నారు. అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని, మళ్లీ రాజయ్య గెలుస్తారని పేర్కొన్నారు. 

మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేశిరెడ్డి మనోజ్ రెడ్డిని కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. 15 రోజులు మనోజ్ రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించిందని కేసీఆర్‌కు రాజయ్య వివరించారు. ధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటానని కేసీఆర్ వారికి చెప్పారు.