గోదావరి ట్రిబ్యునల్‌‌కు కేసీఆర్‌‌ ఓకే

కృష్ణా ట్రిబ్యునల్ కోసం సుప్రీం కేసు వెనక్కి తీసుకుంటం
ఒక్క రోజులో ప్రపోజల్ పంపుతామన్న సీఎం
రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ పంపిన జల శక్తి శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గోదావరి నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌‌‌‌ ఓకే చెప్పారని, ఒక్క రోజులోనే అందుకు ప్రతిపాదనలు పంపుతానని తెలిపారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. గోదావరిలో నీటి పంపకాలకు ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్‌‌‌‌ ప్రతిపాదించగా రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపితే తాము సిద్ధమని కేంద్ర మంత్రి సూచించారని, దానికి కేసీఆర్ ఓకే చెప్పారని తెలిపింది. అలాగే ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ వాటర్‌‌‌‌ డిస్పూట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1956లోని సెక్షన్‌‌‌‌ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కోరగా ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, విత్‌‌‌‌ డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారంది. న్యాయసలహా తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పగా కేసు వాపస్‌‌‌‌ తీసుకునేందుకు కేసీఆర్ సమ్మతించారు. అక్టోబర్‌‌‌‌ 6న జరిగిన రెండో అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ మినిట్స్‌‌‌‌ను తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం ఆ శాఖ అండర్‌‌‌‌ సెక్రటరీ ఏసీ మాలిక్‌‌‌‌ పంపారు.

జ్యురిస్​డిక్షన్లకు నో చెప్పిన కేసీఆర్​

విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన కేఆర్‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌ఎంబీలకు జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ నోటిఫై చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించగా దాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. అయితే ఏపీ పునర్​ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బోర్డులకు జ్యురిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ నోటిఫై చేసే అధికారం కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. హైడ్రాలజీ, ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌లు, ఇతర అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు నిర్మించారని ఆయన తెలిపారు. వాటి డీపీఆర్‌‌‌‌లు ఇవ్వాలని.. రివర్‌‌‌‌ బోర్డులు, కేంద్ర జలశక్తి శాఖ పలుమార్లు లేఖలు రాసినా రెండు రాష్ట్రాలు స్పందించలేదని గుర్తు చేశారు. నీటి కేటాయింపుల్లేకుండా చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ, సంబంధిత రివర్‌‌‌‌ బోర్డు టెక్నికల్‌‌‌‌ అప్రైజల్‌‌‌‌ కోసం డీపీఆర్‌‌‌‌లు సమర్పించేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు.

ఏడాదికోసారి అపెక్స్​భేటీ

ఏపీ సర్కారు సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులు పూర్తిగా కృష్ణా బేసిన్‌‌‌‌ అవతలికి నీటిని తరలించడానికేనని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. 2016లో జలశక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం బేసిన్‌‌‌‌ అవసరాలు తీరాకే బేసిన్‌‌‌‌ అవతలికి నీటిని తరలించాల్సి ఉంటుందని సూచించారు. ఏపీ సీఎం బదులిస్తూ రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ కింద కొత్త ఆయకట్టు లేదని, పాత ప్రాజెక్టుల కింద భూములకు నీళ్లు ఇవ్వడానికే కొత్త లిఫ్ట్‌‌‌‌ చేపడుతున్నామన్నారు. తమ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల నీటినే అన్ని ప్రాజెక్టులకు వాడుకుంటున్నామన్నారు. తెలంగాణలోని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మాదిరిగానే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాలని, వాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవడం తప్ప వేరే అవకాశం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు చర్చించి పరిష్కారానికి ఏడాదికోసారి అపెక్స్‌‌‌‌ భేటీ నిర్వహిస్తే బాగుంటుందని సూచించగా రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు.

మినిట్స్​పై త్వరలో సీఎం సమీక్ష

అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ మినిట్స్‌‌‌‌పై కేసీఆర్‌‌‌‌ త్వరలోనే సమీక్షించనున్నారు. దసరా తర్వాత దీనిపై సీఎం రివ్యూ చేసే అవకాశమున్నట్టు తెలిసింది. మినిట్స్‌‌‌‌పై ఇద్దరు సీఎంలు సంతకాలు చేశాకే ఫైనల్‌‌‌‌ చేయాలని అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌లోనే కేసీఆర్‌‌‌‌ ప్రతిపాదించారు. అయితే కేసీఆర్‌‌‌‌ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే మినిట్స్​ను రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర సహాయ మంత్రికి, సీడబ్ల్యూసీ, కేఆర్‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌లు, జలశక్తి శాఖ జాయింట్‌‌‌‌ సెక్రటరీ, సీనియర్‌‌‌‌ జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌, డిప్యూటీ సెక్రటరీలకు పంపింది.

For More News..

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు

సర్కార్ ఉద్యోగులకు డీఏ

మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..