ఉద్యోగుల భూములనూ కేసీఆర్ లాక్కున్నడు

ఉద్యోగుల భూములనూ కేసీఆర్ లాక్కున్నడు
  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని తెలుగు వర్సిటీ లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ గోపనపల్లి ఇండ్ల స్థలాల సమస్య’ పై మంగళవారం సదస్సు నిర్వహించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమురెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో చిన్నరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన భూములను కేసీఆర్ అధికారంలోకి రాగానే లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదని, విచ్ఛిన్నం చేసిందని కోదండరాం వంటి ఉద్యమ నేతలను అణగదొక్కారని విమర్శించారు. గోపనపల్లి లోని భూమి సమస్యపై  సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరిస్తానని హామీనిచ్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యోగుల భూములను కేసీఆర్ లాగేసుకున్నా రని, దీంతో ఆయన వైఖరేంటో స్పష్టమైందన్నారు. అనంతరం పెన్షనర్లు చిన్నారెడ్డి, కోదండరాంలను సత్కరించారు.  ఈ సదస్సులో  టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్, కార్యదర్శి ముజీబ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.