కేసీఆర్​.. కేటీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నారు

కేటీఆర్​.. కేసీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  బీఆర్​ఎస్​ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ... ఇచ్చిన మాట ప్రకారం నిధుల కొరత ఉన్నా..  రైతు రుణమాఫీ చేశామన్నారు.  సన్నవడ్లు పండించిన రైతులకు రూ. 500 బోనస్​ ఇస్తున్నామన్నారు.  ఇప్పటికి33 కోట్ల రూపాయిల బోనస్​ ఇచ్చామన్నారు.  

ప్రతి పక్షాలు బోనస్​ ఇవ్వడం లేదని రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి శ్రీధర్​ బాబు మండి పడ్డారు.  బోనస్​ విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు పోవద్దని ఆయన తెలిపారు.  ధాన్యం కొన్న ఐదారు రోజులకే బోనస్​ ఇస్తున్నామన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ నేతలు రైతులను అన్యాయం చేశారంటూ.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

Also Read : ఏం చేసుకుంటావో చేసుకో.. అరెస్ట్ చేస్తే చేస్కో