కాంగ్రెస్ రాంగనే కరెంట్ పోయిందని కేసీఆర్ విమర్శించారు. ‘‘మేం కరెంట్ బాగుచేసి 24 గంటలు ఇచ్చినం. కేసీఆర్ పోంగనే కట్కా బందు చేసినట్టు కరెంట్ పోతదా? ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మలు, చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది” అని అన్నారు. ప్రజలను కరెంట్, నీళ్లకు తిప్పలు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీలో జనరేటర్ పెట్టారని చెప్పారు. ‘‘జగదీశ్‌రెడ్డి సభలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోయింది.
Also Read : శాతవాహన యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ
మీకు నడపడం చేతగాక మంది మీద బద్నాం పెట్టి బతుకుదామనుకుంటున్నారు. బిడ్డా జాగ్రత్త.. మిమ్మల్ని బతకనీయం. వెంటపడతం.. వేటాడతాం’’ అని అన్నారు. ‘‘రైతుబంధు ఇచ్చుడుచేతకావడం లేదా? రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానంటవా? ఎన్ని గుండెలురా నీకు.. కండకావరమా.. కళ్లు నెత్తికెక్కినయా.. రైతుల చెప్పులు బందబస్తుగా ఉంటయ్. ఒక్కటి కొడితే మూడు పళ్లు ఊసిపోతయ్. ప్రజలను గౌరవించే పద్ధతా ఇది. మీకు చేతగాక పోతే తర్వాత ఇస్తామని చెప్పాలే. పైసలు లేవని చెప్పాలే. చేయొస్తలేదని చెప్పాలే. చెప్పుతో కొట్టాలని అంటరా’’ అని మండిపడ్డారు.