మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి మళ్లీ సిట్టింగ్ కే అవకాశం ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించారు కేసీఆర్. దీంతో ఐదు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినట్టు.  మార్చి 4వ తేదీ బీఆర్ఎస్ భవన్ లో జరిగిన భేటీ తర్వాత.. 4 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే..

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు.పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మళ్లీ పోటీ చేయనున్నారు. మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితను మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.

ALSO READ :- సోషల్ మీడియాలో లైక్ల కోసం.. హైదరాబాద్లో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు

ఐదు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు 

  • మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్
  • కరీంనగర్ - బి వినోద్ కుమార్
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
  • ఖమ్మం - నామ నాగేశ్వర్ రావు
  • మహబూబాబాద్ - మాలోత్ కవిత