ఐదుగురు యువకులు ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ల పంపిణీ
మంత్రి గంగుల సమక్షంలో బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ పేరుతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కొత్త పథకాన్ని ప్రకటించింది. మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ (ఎంబీసీ) యువకులకు ఉపాధి కోసం అంబులెన్సులను అందించేందుకు ‘కేసీఆర్ ఆపద్బంధు’ స్కీమ్‌ను తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాకు ఐదుగురు నిరుద్యోగ యువకులను ఒక గ్రూపుగా గుర్తించి అంబులెన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ. 12 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇందులో 10 శాతం లబ్ధిదారులు భరించాలి. స్కీంకు కావాల్సిన నిధులు ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సమకూర్చనున్నారు. గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ బీసీ వెల్ఫేర్ అధికారులతో జరిపిన సమీక్షలో ‘కేసీఆర్ ఆపద్బంధు’ పథకంపై నిర్ణయం తీసుకున్నారు. 10 వేల మంది నిరుపేద బీసీ మహిళలకు నిఫ్ట్ ద్వారా కుట్టు పనిలో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సీఎం కేసీఆర్ పేరిట ఇప్పటి వరకు ‘కేసీఆర్ కిట్’ పథకం ఉంది. దీని ద్వారా సర్కారు దవాఖాన్లలో ప్రసవం చేసుకునే వారికి కిట్ అందజేస్తున్నారు.
For More News..