రిపబ్లిక్ డే రోజున గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మందిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కాగా.. ఈ అధ్యక్ష పదవులలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటడం గమనార్హం. అయితే వీరితో పాటు ఓ మాజీ ఎంపీపీ కూడా జిల్లా అధ్యక్షుడి పీఠం దక్కించుకున్నారు. రాజన్న సిరసిల్ల జిల్లాకు చెందిన మాజీ ఎంపీపీ తోట ఆగయ్య జిల్లా అధ్యక్షుడి పదవికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. అదేవిధంగా జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్ గా గతంలో పనిచేసిన వ్యక్తికి కూడా ఈ బాధ్యతలు అప్పగించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. pic.twitter.com/f6sagetlrY
— TRS Party (@trspartyonline) January 26, 2022
For More News..