
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో పాలు పలువురు కీలక నేతలు కేసీఆర్ ను కలవడానికి వచ్చారు. కేసీఆర్ ను కలిసి బర్త్ డే విషెస్ చెప్పారు. భారీగా తరలివచ్చిన అభిమానులకు కేసీఆర్ ఫామ్ హౌస్ బాల్కనీ నుంచి అభివాదం తెలిపారు. కేసీఆర్ ఇవాళ ఫిబ్రవరి 17న 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే..
కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మంత్రి పొన్నం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి నారా లోకేష్ కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కూడా కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,కార్యకర్తలు పాల్గొన్నారు. హరీశ్ రావు, కేటీఆర్,తలసాని పలువురు నేతలు 71 కిలోల కేక్ కట్ చేశారు.