- సీఎం నాయకత్వంలో పని చేయాలనే ఆసక్తి ఉంది
- స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేసీఆర్ ఆశీర్వదిస్తే తాను కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తి ఉందని స్టేట్హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు చెప్పారు. కొత్తగూడెం క్లబ్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు జనరల్ సీట్లు ఉన్నాయన్నారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఓసీలకే టికెట్లు ఇస్తున్నారన్నారు. కొత్తగూడెం సీటును బీసీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు ఆలోచించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ను కలిసి కోరతానన్నారు. తనకు కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. మరో కొత్త కొత్తగూడెం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో గడప గడపకు గడల ప్రోగ్రాం చేపడతామన్నారు.
డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి
రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1615 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 2,315కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. వరదలు, వర్షాలు, డెంగ్యూ కేసుల నేపథ్యంలో వచ్చే నెల వరకు వైద్యశాఖలో సెలవులు రద్దు చేశామన్నారు..