సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి రూ. వందకోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూకు కేసీఆర్ ప్రయాణించే బస్సు చేరుకుంది.
సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి రానున్న కేసీఆర్..ఎలిప్యాడ్లో దిగుతారు. అక్కడ నుండి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్తారు.
తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండగట్టును ఆలయాన్ని పరిశీలిస్తారు. కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు మరికొన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ఆలయ పరిశీలన తర్వాత అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.