తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని.. ఆ గౌరవం ఈ జిల్లాకే దక్కుతుందని అన్నారు. నాగర్ కర్నూల్ లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయని అన్నారు కేసీఆర్. తాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అన్నం తింటుంటే పదిసార్లు కరెంట్ పోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంట్ ఇచ్చామని తెలిపారు.
బీజేపీ తెలంగాణ అక్కరకు రాని చుట్టమని విమర్శించారు కేసీఆర్. మోదీ వంద నినాదాలు ఇచ్చారని ఒక్కటైన నిజం చేశారా ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క నవోదయ, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదన్నారు. ప్రవీణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గురుకుల కాలేజీలను ఇంటర్నేషల్ స్థాయిలో ప్రవీణ్ కుమార్ అభివృద్ధి చేశారని ఆయన ఆశామాషీ మనిషి కాదని కమిట్ మెంట్ ఉన్న వ్యక్తిని కొనియాడారు.