KCR: ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి.. బీఏసీ మీటింగ్కు గైర్హాజరు.. 40 నిమిషాల్లోనే వెళ్లిపోయారు..

KCR: ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి.. బీఏసీ మీటింగ్కు గైర్హాజరు.. 40 నిమిషాల్లోనే వెళ్లిపోయారు..

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరు నెలల తర్వాత ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. గంట ముందు అసెంబ్లీకి వచ్చిన ఆయన నేరుగా ఎల్పీ కార్యాలయానికి వెళ్లి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అనంతరం సభకు వచ్చారు.  

ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తవగానే నేరుగా నందినగర్ లోని  నివాసానికి వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీఏసీ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. 

మొత్తంగా గవర్నర్  ప్రసంగం 40 నిమిషాలు జరగగా.. జాతీయ గీతం మొదలైనప్పటి నుంచి ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలోనే ఉన్నారు. తర్వాత ఇంటికి వెళ్లిపోవడం గమనార్హం.

ALSO READ | బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారు..? ప్రభుత్వ విప్లు, MLAలకు సీఎం క్లాస్