
ఫాంహౌస్ సీఎం అంటూ కేసీఆర్ ను ప్రతిపక్షాలు తరుచూ విమర్శిస్తుంటాయి. కేసీఆర్ కూడా ఎక్కువగా ఫాంహౌస్ లోనే ఉంటారు. ఇప్పుడు కూడా సుమారు 17 రోజుల తర్వాత ఫాంహౌస్ నుండి బయటకు వచ్చారు సీఎం. గత నెల 29 నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌కు వచ్చారు. ప్రగతిభవన్‌కు రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. రేపు రాజ్యసభ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు. అనంతరం ఎల్లుండి మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రగతి, పల్లెప్రగతిపై సమీక్ష చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపీ తమ సభలతో ప్రభుత్వంపై విరుచుకపడుతున్న తరుణంలో కేసీఆర్ కూడా త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి వారికి కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.