
వికారాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన కేసీఆర్.. వరంగల్సభలో అబద్ధాలు, అసత్యాలు చెప్పారని అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్కుమార్విమర్శించారు. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. సోమవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్, వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి, ధారూర్ లో సోమవారం నిర్వహించిన భూభారతి, ఓఆర్ఆర్ చట్టం అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులు లేకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేవాళ్లమన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరగానే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. భూ భారతితో భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్లింగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.