
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్పూర్తిగా చంద్రముఖిగా మారిండని, ఆయన కుట్రలకు కేటీఆర్ఆజ్యం పోస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతోపాటు కొడుకును చాంపియన్ చేయాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాజకీయ కుట్రలకు తెరతీస్తున్నాడని, చివరకు అధికారులపై దాడులకు పురిగొల్పుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారం చేజారి ఏడాది కాకముందే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.