జగిత్యాల టౌన్, వెలుగు: కేసీఆర్మళ్లీ అధికారంలోకి వస్తే కట్టుబట్టలు కూడా మిగలవని, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు అమ్మేస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగిత్యాలలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాయకుల ప్రసంగాలు, సందేశం ప్రగతికి నివేదికగా భావిస్తాం కానీ, ఖిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పారని, అందులో 10 శాతం కూడా నిజాలు లేవన్నారు.
జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్ట్, సూరమ్మ చెరువు, సదర్ మట్, పోతారం చెరువు పనులు ఏవీ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. దళితులతో పాటు ఇటు బీసీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గిరి నాగభూషణం, శంకర్, దుర్గయ్య, రాజేందర్ పాల్గొన్నారు.