ఇన్నాళ్లు దేశాన్ని దద్దమ్మలు పాలించారు: కేసీఆర్

ఇన్నాళ్లు దేశాన్ని దద్దమ్మలు పాలించారు: కేసీఆర్

రాహుల్, మోడీ ఎవరు వచ్చినా దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.  పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  ఇన్నాళ్ళు దేశాన్ని దద్దమ్మలు పాలించారని మండిపడ్డారు.  మోడీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదన్నారు కేసీఆర్.  మోడీ, రాహుల్ సభలకు జనమే రావడం లేదన్నారు.  సింగరేణి కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు కేసీఆర్.  రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ వ్యతిరేకమనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. రిజర్వ్ బ్యాంకు,ఇతర సంస్థల వద్ద 20 నుంచి 25 లక్షల కోట్లు వృథాగా ఉన్నాయన్నారు. ఈ డబ్బును సరిగా వినియోగించుకునే వారే లేరన్నారు. కాళేశ్వరం పూర్తయితే గోదావరి నీళ్లతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఆర్ఎస్ వచ్చాక తెలంగాణ ఎలా ఉందో ఇంతకు ముందు ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తామన్నారు. ప్రజలకు మేలు చేయడమే తప్ప ఎవరీకీ వ్యతిరేకం కాదన్నారు.