మంద జగన్నాథం మృతిపట్ల కేసీఆర్ సంతాపం

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.  మంద జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‎లోని నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథం 2025, జనవరి 12న తుదిశ్వాస విడిచారు.రేపు (జనవరి 13)  చంపాపేట్ లో  జగన్నాథం అంత్యక్రియలు జరగనున్నాయి. మంద జగన్నాథం నాగర్ కర్నూల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. 

ALSO READ | మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

కొన్ని రోజులుగా నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథంకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు పొన్నం ప్రభాకర్,  సీతక్క, దామోదర రాజ నర్సింహా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జగన్నాథంను పరామర్శించి మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.