
జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తండ్రి హనుమంతరావు పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి వేర్వేరుగా హాజరయ్యారు. హనుమంతరావు ఇటీవల కన్నుమూశారు. ఆయన చిత్రపటానికి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ సీఎంతోపాటు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్‌పర్సన్ వసంత, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, రాజేశంగౌడ్, రవీందర్రావు, బీజేపీ లీడర్ రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పరామర్శించారు.