జిట్టా మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది: కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని ఈ సందర్భంగా జిట్టా కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. జిట్టా మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్త కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెన్షన్‭తో బాధపడుతోన్న జిట్టా ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 6) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‎లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజల్లో ఉద్యమ కాంక్షను మరింత రగిలించడంలో జిట్టా పెద్దన్న పాత్ర పోషించారు. జిట్టా మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.