హైదరాబాద్: మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీభాష్యం విజయసారథి సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని అన్నారు. వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజశారు.